హ్యాపీ బర్త్‌డే నాన్న: జగన్ భావోద్వేగ ట్వీట్

YS Jagan tweets on his father YSR's birthday
Highlights

దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బర్త్‌డేను పురస్కరించుకొని ఆయన తనయుడు వైఎస్ జగన్ భావోద్వేగపు ట్వీట్ చేశారు. జగన్ పాదయాత్ర ఇవాళ్టికి 2500 కి.మీ చేరుకొంది. ఈ మేరకు హ్యాప్టీబర్త్‌డే నాన్న అంటూ జగన్ ట్వీట్ చేశారు.

రామచంద్రాపురం: తన తండ్రి పుట్టిన రోజునే తాను చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2500 కి.మీ. అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన అనుబంధాన్ని ఆయన పంచుకొన్నారు.

వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  ఇవాళ 2500 కి.మీ చేరుకొంది. ఇవాళే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో వైఎస్ జగన్  ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు.  తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2500 కి.మీ అరుదైన మైలురాయిని చేరుకోనుండటం కేవలం యాధృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా నాకు ప్రతిబింబించేలా ఉంది. స్వర్గం నుంచి నాన్న వైఎస్సార్‌ ఆశీర్వదించారని ఆయన అభిప్రాయపడ్డారు.

హ్యాపీ బర్త్‌డే నాన్న. ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అని వైఎస్‌ జగన్‌ ఉద్వేగభరితంగా ట్వీట్‌ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 208వ రోజుకు చేరుకొంది.. 

loader