వరద బాధిత ప్రాంతాల్లో జగన్ టూర్: రెండు రోజులు మూడు జిల్లాల్లో సీఎం పర్యటన
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పాటు మూడు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. రేపు నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.
అమరావతి: గత నెలలో రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నుండి పర్యటించనున్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో Ys Jagan పర్యటిస్తారు. ఇవాళ కడప, చిత్తూరు జిల్లాల్లోని బాధితులు, రైతులతో సీఎం నేరుగా మాట్లాడుతారు. Heavy Rains దెబ్బతిన్న Annamaiahప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తారు. పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితులతో సీఎం మాట్లాడుతారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్షించనున్నారు.
also read:Cyclone Jawad: సీఎం జగన్ సమీక్ష, ముగ్గురు సీనియర్ అధికారుల నియామకం
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు. ఇవాళ రాత్రికి అనంతరం రాత్రికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు.రేపు Chittoor, Nellore జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ రెండు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సహాయంపై చర్చించనున్నారు.కొద్దిసేపి క్రితం సీఎం జగన్ అమరావతి నుండి కడప జిల్లాకు బయలు దేరి వెళ్లారు. జిల్లాలోని పులపుత్తూరు గ్రామానికి చేరుకుని అక్కడ వరద బాధితులతో సీఎం మాట్లాడతారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం పులపుత్తూరు సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 1.30 గంటల ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.05 గంటలకు హెలిప్యాడ్ నుంచి చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంటకు బయలుదేరి వెళతారు.
కడప జిల్లాలో కాలినడకన వరద బాధితులను పరామర్శించిన జగన్
ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ కడప జిల్లాకు చేరుకొన్నారు. కడప జిల్లాలోని పులపత్తూరులోని వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. కాలి నడకన వరద బాధితులను కలుసుకొన్నారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకొన్నారు. వరదలో తాము సర్వస్వం కోల్పోయామని బాధితులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఓ బాధితురాలు మాత్రం తన ఇల్లుతో పాటు అన్ని కోల్పోయామన్నారు. అయితే ఇంటి గురించి తనకు వదిలేయాలని సీఎం జగన్ చెప్పారు. వరద ప్రభావం గురించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా సీఎం జగన్ పరిశీలించారు. జిల్లాల్లోని ఏ ఏ ప్రాంతంలో వరద పరిస్థితి ఎలా ఉందనే విషయమై అధికారులు సీఎం జగన్ కు వివరించారు.పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సౌకర్యాలను సీఎం జగన్ అడిగి తెలుసుకొన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నవంబర్ మాసంలో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో భారీ నష్టం చోటు చేసుకొందని సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తక్షణ సహాయంగా రూ. 1000 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.ఇటీవలనే రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించింది. రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించిన సేవలపై కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది.