Cyclone Jawad: సీఎం జగన్ సమీక్ష, ముగ్గురు సీనియర్ అధికారుల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జవాద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది.
అమరావతి: జవాద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందిని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం Ys Jagan ఆదేశించారు.తుఫాన్ సహాయక చర్యల పర్యవేక్షణకు గాను ముగ్గురు సీనియర్ అధికారులను సీఎం జగన్ నియమించారు. తుఫాన్ సహాయక చర్యల పర్యవేక్షణకు శ్రీకాకుళం జిల్లాకు అరుణ్ కుమార్, విజయ నగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖకు శ్యామలారావులను నియమించారు సీఎం జగన్.
also read:Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో వానగండం.. దూసుకొస్తున్న తుఫాన్
అండమాన్ సమీపంలో Bay of Bengal అల్పపీడనం ఏర్పడింది.. అది వేగంగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు దూసుకొస్తుంది. తొలుత వాయుగుండంగా మారి, ఆ తర్వాత Cyclone గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో వేగంగా వీచే గాలులు, భారీ వర్షాలు మరోసారి Andhra Pradesh ను అల్లకల్లోలం చేసే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.గత మాసంలోనే భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు,చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. తాజాగా మరో తుఫాన్ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉంది. ఈ తుఫాన్ ను దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల్లో పునరావాస శిబిరాల ఏర్పాటు తదితర విషయాలపై సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. చుకొని ఆయా జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల్లో పునరావాస శిబిరాల ఏర్పాటు తదితర విషయాలపై సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి ఇది ఉత్తరాంధ్ర- ఒడిశా తీరాలకు చేరుకుని మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే డిసెంబర్ 2 నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో.. డిసెంబర్ 2వ తేదీ నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు తెలిపారు.గత మాసంలో భారీ వర్షాల నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇటీవలనే పర్యటించింది. మరోసారి తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.