వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళుతున్నారు. శనివారం ఉదయం బయలుదేరుతున్న జగన్ మళ్ళీ మూడు రోజుల తర్వాత తిరిగి వస్తారు. నవంబర్ 6వ తేదీ నుండి పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవ్వాలంటే దాదాపు 7 మాసాలు పడుతుంది. ఒకసారి పాదయాత్ర మొదలైతే మళ్ళీ ఎక్కడికీ వెళ్లడానికి కుదరదు కదా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జగన్ కూతురు వైఎస్ హర్ష విద్యాభ్యాసం చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర మొదలైతే మధ్యలో ఆపటానికి వీల్లేదు కాబట్టి  కూతురును చూడటం కోసం ముందుగానే ఓ సారి లండన్ వెళుతున్నారు.