హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం డిక్లరేషన్ వివాదానికి హైకోర్టు తెర దించింది. ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  టీటీడీ ఆహ్వానంతో బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధిగా వెళ్లారని గుర్తు చేస్తూ దేవాదాయ చట్టం నిబంధనల మేరకు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పింది. 

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హిందూయేతరుడై, వ్యక్తిగత హోదాలో తిరుమల దర్శనానికి, ప్రార్థనల నిమిత్తం వెళ్తే అప్పుడు ఆ వ్యక్తి నిబంధనల మేరకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు వివరించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్లిన జగన్ి ఏ విధమైన డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని, అందువల్ల ఏ అధికారంతో ఆనయ సిఎంగా కొనసాగుతున్నారో వివరణ కోరాలన దాఖాలైన రిట్ ఆఫ్ వారెంటో పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.

ఈ మేరకు హైకోర్టు 27 పేజీల తీర్పుు వెలువరించింది. గుంటూరు జిల్ాల వైకుంఠపురానికి చెందన రైతు ఆలోకం సుధాకర్ బాబు ఆ పిటిషన్ దాఖలుచేశారు. జగన్ తో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, టీటీడీ చైర్మన్, ఈవోలు కూడా ఏ అధికారంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ మీద న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీన తీర్పును వాయిదా వేసిన ఆయన బుధవారం దాన్ని వెలువరించారు. 

ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు పిటిషనర్ తగిన ఆధారాలు చూపలేకపోయారని న్యాయమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడని, ఆయన క్రైస్తవ మతాన్నిఅనుసరిస్తున్నారని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సమర్పించలేకపోయారనికి ఆయన అన్నారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసినంత మాత్రాన, క్రైస్తవ సభల్లో పాల్గొన్నంత మాత్రాన ఓ వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించలేమని అన్నారు.

బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో శ్రీవేంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని పిటిషనర్ స్వయంగా చెబుతున్ారని, ప్రభుత్వం తరఫున కైంకర్యం సమర్పించే ఆనవాయితీ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు టీటీడీ సంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతోందని న్యాయమూర్తి అన్నారు. 

ప్రధాన మంత్రి హోదాలో ఇందిరా గాంధీ, రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిి దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని పిటిషనర్ చెబుతున్నారని, నిజానికి ఇందిరా గాంధీ, అబ్దుల్ కలాంలు ప్రధానిగా, రాష్ట్రపతిగా శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మాత్రమే వచ్చారని, వారు ప్రధానిగా, రాష్ట్రపతిగా టీటీడీ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఆచారాలను పాటించడానికి రాలేదని ఆయన చెప్పారు. టీటీడీ సంప్రదాయాల మేరకు ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.