పాదయాత్రకు విరామం

పాదయాత్రకు విరామం

మొట్టమొదటి సారిగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికారికంగా పాదయాత్రలో సోమవారం విరామం తీసుకుంటున్నారు. నవంబర్ 6వ తేదీ పాదయాత్ర మొదలైనప్పటి నుండి పాదయాత్రలో విరామం తీసుకోలేదు. అక్రమాస్తుల విచారణ నిమ్మితం కోర్టుకు హాజరవ్వాలి కాబట్టి ప్రతీ శుక్రవారం పాదయాత్ర నిలిపేస్తున్నారు. కోర్టుకు హాజరవ్వటం మినహా ఇతరత్రా కారణాలతో విరామం తీసుకోలేదు. సోమవారం క్రిస్మస్ పండుగను దృష్టిలో పెట్టుకుని జగన్ విరామం తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

నియోజకవర్గం గాండ్లపెంటలోని శిబిరానికి ఆదివారం రాత్రికి చేరుకున్నారు. అప్పటి నుండి జగన్ శిబిరం బయటకు రాలేదు. పూర్తిస్ధాయిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపటానికి వైఎస్ అభిమానులందరూ గాండ్లపెంటకు చేరుకుంటున్నారు. శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చే వారికి అందుబాటులో ఉండాలని, ప్రత్యేక ప్రార్ధనలు చేయటం తదితరాలు పాదయాత్రలో సాధ్యం కాదు. అందుకే పూర్తి విరామం తీసుకోవాలని నిర్ణయించారు. పాదయాత్ర మొదలుపెట్టి ఆదివారానికి 43 రోజులు పూర్తయ్యింది. ఇప్పటి వరకూ 605 కిలోమీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో రోజుకు సగటున 12 కిలోమీటర్లు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page