Asianet News TeluguAsianet News Telugu

రీపోలింగ్ అప్రజాస్వామికమా లేక రిగ్గింగా, జంకు ఎందుకు?: చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ జగన్

చంద్రబాబుగారూ రీపోలింగ్‌ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? అంటూ నిలదీశారు. చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా? అంటూ ప్రశ్నించారు. అసలు రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అని నిలదీశారు. 
 
ys jagan slams ap cm chandrababu over re polling
Author
Hyderabad, First Published May 17, 2019, 8:51 PM IST

హైదరాబాద్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రీ పోలింగ్ తెలుగుదేశం చేస్తున్న రాద్ధాంతాన్ని ఖండించారు వైఎస్ జగన్. 

చంద్రబాబుగారూ రీపోలింగ్‌ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? అంటూ నిలదీశారు. చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా? అంటూ ప్రశ్నించారు. అసలు రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అని నిలదీశారు. 

రిగ్గింగ్ జరిగిన ఆ ఐదు పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇకపోతే చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో ఈనెల 19న రీ పోలింగ్ జరగనుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు రీ పోలింగ్ వ్యవహారంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలు జరిగిన 40 రోజుల్లో రీ పోలింగ్ నిర్వహించడంపై న్యాయస్థానాలను సైతం ఆశ్రయించింది. 

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రీ పోలింగ్ ను స్వాగతిస్తోంది. ఇప్పటికే ఈ రీ పోలింగ్ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. ఆదివారం జరగబోయే లోపు ఇంకెన్ని పరిణమాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios