వైసిపి ఎంఎల్ఏ రోజా పెద్ద శపథమే చేశారు. వడమాలపేట మండల కేంద్రంలో జరిగిన జగన్ పాదయాత్రలో భాగంగా సభ జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ను సిఎం చేసేంత వరకూ నిద్రపోనని శపథమే చేశారు. జగన్ వెన్నంటే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున అత్యదికులు ఎంఎల్ఏలుగా గెలిచేందుకూ తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

పోయిన ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినట్లు మండిపడ్డారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి రావటానికి చంద్రబాబు సిద్దపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసాలను జనాలు గుర్తుంచుకోవాలని పిలుపిచ్చారు.