విజయవాడ: కర్నూలు జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆ సమస్యపై ఆయన గురువారం ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించారు. ఇది చాలా అమానవీయమని ఆయన అన్నారు. కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చునని, అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చునని ఆయన అన్నారు. 

కరోనా సోకినవారిని అంటరాని వాళ్లుగా చూడ్డం సరైంది కాదని జగన్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్టుకాదని అన్నారు. అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదని చెప్పారు. అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చునని, మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలని ఆయన అన్నారు. 

బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదని జగన్ అన్నారు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీకి సూచించారు. కరోనా వస్తే.. మందులు తీసుకుంటే.. అది పోతుంది:కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడ్డం సరికాదని, తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కేసులుకూడా పెట్టొచ్చునని,కరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరాని తనంగా చూడ్డం సరికాదని అన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారో చూడాలని ఆయన అన్నారు.నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేదని అన్నారు. :తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నంచేయొద్దని సీఎం ్న్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది: