అమరావతి: టిడ్కో ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ సీఎం జగన్ జోక్యం చేసుకొన్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

మంగళవారం నాడు ఉదయం నుండి టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో  టీడీపీ , వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. బాబుపై జగన్ నిప్పులు చెరిగారు. 

ఒక మనిషి వయసు పెరిగినా స్పష్టంగా మేనిఫెస్టో అన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు కు నరకంలో కూడా చోటు దొరకదన్నారు.

 పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే మేనిఫెస్టోను మంత్రి బొత్స సత్యనారాయణ చూపించారు. అదే బైబిల్, భగవద్గీత, ఖురాన్‌ అని చెప్పాం.
నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను అన్నది ఇప్పుడు కూడా టెలికాస్ట్‌ చేయిస్తానని ఆయన స్పష్టం చేశారు.

 మేనిఫెస్టోలో ఏం చెప్పామన్న దాంట్లో ఒక లైన్‌ తీసేయిస్తాడు. ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడని బాబుపై విమర్శలు గుప్పించారు.మేనిఫెస్టోలో ఏం రాశామన్నది కూడా చదివి వినిపిస్తాను అంటూ  జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీని ప్రస్తావించారు.

 ‘పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగుకు రూ.2 వేలకు అమ్మారు. అందులో 3 లక్షల రూపాయలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని, 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3 వేలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారం రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది'
 మరి ఆయన కళ్లకు గుడ్డి వచ్చిందా? కళ్లు కనిపించడం లేదా? 300 అడుగులు అన్నది ఆయనకు కనిపించడం లేదా?  అని ఆయన ప్రశ్నించారు.

 అందుకే అదే మేనిఫెస్టోను స్క్రీన్‌లో చూపించండి. ఆ 300 అడుగులు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.ఇదే మేనిఫెస్టోకు సంబంధించి నేను మాట్లాడిన మాటలను ప్లే కూడా చేద్దామన్నారు. ఆ 300 అడుగులు అన్నది ఆయనకు ఎందుకు కనిపించడం లేదు? కళ్లకు గుడ్డి వచ్చిందా? లేక పూర్తిగా బుద్ధి వక్రీకరించిందా? అని జగన్ అడిగారు.

 నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు?. ఆయనకు క్లారిటీ ఉందా? అని ప్రశ్నించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అప్పు తీసేస్తామని చెప్పామన్నారు.

also read:ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు మినహా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

 అంత క్లియర్‌కట్‌గామేము చెబితే చంద్రబాబునాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు.
నేను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టాము. 

also read:పిచ్చిపట్టింది, ఎర్రగడ్డకు తీసుకెళ్లండి: జగన్, ఎవరు వెళ్లాలో తేల్చుకొందామన్న బాబు

అయినా ఈ మనిషి ఏదేదో మాట్లాడుతున్నాడన్నారని జగన్ బాబుపై మండిపడ్డారు.  ఎక్కడికక్కడ ఆయన వక్రీకరిస్తున్నాడు. మేము ఏం చెప్పాము. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు.అసలు ఆయనకు బుర్ర ఏమైనా ఉందా? వాటీజ్‌ రాంగ్‌ విత్‌ దిస్‌ మ్యాన్ అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.