అనంతపురం: ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చేస్తున్న ధర్మపోరాట దీక్షపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష యూటర్న్ దీక్ష అంటూ కొట్టిపారేశారు. 

నాలుగున్నరేళ్లు ప్రత్యేక హోదా ఊసెత్తని చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని తెలిసి భుజానకెత్తుకుని దొంగదీక్షలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నల్ల చొక్కాలు ధరించి ఢిల్లీలో కొత్త డ్రామాకు తెరలేపారని విరుచుకుపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసింది పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని జగన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలు ఇప్పటికే ప్రజల్లో గుర్తు ఉన్నాయన్నారు. 

ప్రత్యేక హోదా కోసం తాము పోరాడితే అరెస్ట్ లు చెయ్యించింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అంటూ నానా మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ దీక్షలకు దిగడాన్ని యూటర్న్ డ్రామాగా అభివర్ణించారు. 

అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా తీర్మాణం చేసిన చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ నల్లచొక్కాలు ధరించి దీక్షలు చెయ్యడం విడ్డూరంగా ఉందన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దొంగదీక్షలకు దిగారంటే అది వైఎస్ జగన్ పోరాట ఫలితమేనన్నారు. 

ప్రత్యేక హోదా అన్న పదం చంద్రబాబు నోట్లో నుంచి వస్తుంది అంటే అందుకు కారణం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమేనని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. 

అంతకు ముందు ప్రత్యేక హోదా సంజీవనా, ప్రత్యేక హోదా కంటే ఏపీకి ఎక్కువే చేశారు, హోదా కోసం ఉద్యమాలు చేసే వారిని జైల్లో పెట్టించారని ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. 

నల్లచొక్కాలు వేసుకుని రోజుకో డ్రామా ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. చిలకా గోరింకలు అసూయపడేలా నాలుగున్నరేళ్లు మోదీతో కాపురం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీపై విరుచుకుపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరలేపాడంటూ ధ్వజమెత్తారు. 

ఒకప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక హోదా సంజీవని కాదు అంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు నల్ల చొక్కా ధరించి ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారంటే అది వైఎస్ జగన్ వల్లేనన్న విషయాన్ని ప్రతీ పౌరుడికి తెలియజెయ్యాలని వైఎస్ జగన్ కార్యకర్తలకు సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

57 నెలలు కడుపు మాడ్చి, చివరి మూడు నెలల్లో అన్నం పెడ్తాడట: బాబుపై జగన్

అన్న చేయూత పథకం ద్వారా ప్రతీ మహిళకు రూ.75వేలు: వైఎస్ జగన్

రూ.3000 ఇస్తే రూ.5000కావాలని అడగండి, ఓటు మాత్రం ఆలోచించి వెయ్యండి: వైఎస్ జగన్

మీకు తగిలిన గాయం నా గుండెకు తగిలింది: వైసీపీ శంఖారావంలో వైఎస్ జగన్