అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తే తీసుకోకుండా ఇంకా కావాలని డిమాండ్ చెయ్యాలని కోరారు. 

అనంతపురం జిల్లాలో వైసీపీ సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీ అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు వెయ్యని డ్రామాలు ఉండవు, చెప్పలని అబద్దాలు ఉండవన్నారు. 

ఆఖరికి అవినీతి సొమ్మును పంచేందుకు కూడా వెనకాడరన్నారు. ఐదున్నరేళ్లలో లక్షలాది కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల్లో ఓటుకు రూ. 3000 ఇవ్వాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. అలా రూ.3000 ఇస్తే మూడువేలు వద్దు రూ.5000 కావాలని అడగాలని సూచించారు. 

డబ్బులు తీసుకుని ఓటు మాత్రం భగవంతుడిని తలచుకుని ఓటెయ్యాలని కోరారు. ఏ భగవంతుడు అవినీతి సొమ్మును తీసుకుని ఓటెయ్యమని చెప్పడని స్పష్టం చేశారు. ఇలా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు చేసే ఎన్నికల జిమ్మిక్కులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మీకు తగిలిన గాయం నా గుండెకు తగిలింది: వైసీపీ శంఖారావంలో వైఎస్ జగన్