అమరావతి: మొత్తానికి ఎట్టకేలకు కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రద్దు బిల్లుతో ప్రారంభమయిన అసెంబ్లీ ఇంకా హాట్ హాట్ గానే కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసం మాత్రమే ఈ వికేంద్రీకరణకు పూనుకున్నట్టు వైసీపీ ప్రఙకటించింది. 

ఎందుకు అమరావతిలో కేంద్రీకృతమవ్వకుండా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో తెలుపుతూ, అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణ నుండి మొదలు కట్టిన బిల్డింగుల్లో ఉన్న నాణ్యతా లోపల వరకు అనేక విమర్శలు చేసారు. 

Also read; జగన్ కు పొంచి ఉన్న ముప్పు: బిజెపి రాయలసీమ వ్యూహం

ఇక ఆ తరువాత ప్రతిపక్ష టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇస్తూ వారు వారి వాదనలు వినిపించారు. మధ్యలో స్పీకర్ తమ్మినేని కి ముఖ్యమంత్రిని విచారించమని ఆదేశించే హక్కు లేదంటూ టీడీపీ నేతలు అరవడంతో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఈ అన్ని ఆరోపణ ప్రత్యారోపణలు మధ్య ఏ ప్రాంతానికి ఎం దక్కిందనేదానిపై పూర్తిగా ప్రజలకు క్లారిటీ రాకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతానికి ఏమేమి దక్కాయి ఒకసారి చూద్దాము. 

మొదటగా అమరావతిని శాసనాపరమైన రాజధానిగా ప్రకటిస్తూ, అక్కడే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.  ఇక కర్నూల్ ను జ్యూడిషియల్ రాజధానిగా ప్రకటిస్తూ అక్కడ హై కోర్టును ఏర్పాటు చేయనున్నారు. 

ఇక అతి ముఖ్యమైనది కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించారు. మిగిలిన రెండు రాజధానులకన్నా విశాఖపట్నానికి అత్యధిక ప్రాధాన్యత దక్కింది. 

అయితే గతంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులిచ్చిన నివేదికలను యథాతథంగా కాకుండా వాటిలోంచి కొన్ని అంశాలను మాత్రం మినహాయించినట్టు మనకు అర్థమవుతుంది. 

సచివాలయం, రాజ్ భవన్ లతో సహా అన్ని ప్రభుత్వ విభాగాల హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్స్  అన్నీ విశాఖ నగరంలోనే కొలువుదీరనున్నాయి.  శాసనసభా కార్యకలాపాలు నిర్వహించే సచివాలయం మాత్రం అమరావతి లోనే  ఏర్పాటు చేయనున్నారు.  

జగన్ కు పొంచి ఉన్న ముప్పు: బిజెపి రాయలసీమ వ్యూహం

అసెంబ్లీ సమావేశాలు మాత్రమే అమరావతిలో జరగనున్నాయి. అవి కూడా సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లకు మించవు. కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప అమరావతిలో పెద్ద సందడి కనిపించే ఆస్కారమే లేదు. 

మిగితా అన్ని అధికారిక కార్యక్రమాలన్నీ విశాఖలోనే జరగనున్నాయి. రాజ్ భవన్, సచివాలయం తో పాటుగా ఇతర ముఖ్య కార్యాలయాలు అన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు అవనుండటంతో విశాఖ రూపురేఖలు అతి త్వరలోనే మారుతాయని చెప్పవచ్చు.

దానితోపాటు అమరావతిలో కేవలం అసెంబ్లీ సమావెహ్స్లాప్పుడు మాత్రమే హడావుడి ఉంటుంది తప్ప మిగిలిన సమయంలో అది బోసిపోయి ఉండడం కూడా తథ్యంగా కనబడుతుంది.