జగన్ పాదయాత్రకు ఇవాళ, రేపు బ్రేక్, ఎందుకో తెలుసా?

YS Jagan Padayatra Cancelled Today Due to Heavy Rains
Highlights

నిన్నటితో 200 రోజులకు చేరిన జగన్ పాదయాత్ర...

కడప జిల్లా ఇడుపుల పాయ నుండి జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో రెండు వందల రోజులకు చేరిన విషయం తెలిసిందే. ఆయన అలుపెరగకుండా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జిల్లాలను దాటుతూ ఇప్పటికి 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 201 వ రోజు పాదయాత్ర రద్దయింది.

నిన్న భీమనపల్లి కి చేరుకున్న జగన్ రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం పాదయాత్ర చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఇవాళ్టి యాత్రను రద్దు చేస్తున్నట్లు వైసిపి ప్రకటించింది.

ఇక రేపు శుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది కాబట్టి రేపు  కూడా పాదయాత్ర ఉండదు. ఇలా జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రకు రెండు రోజులు బ్రేక్ వచ్చింది.

200 రోజుల పాదయాత్ర గురించి జగన్ ఎలా స్పందించారో కింది వీడియోలో చూడండి.

"

loader