ఎంపిల రాజీనామాలు: ఏది జరిగినా జగన్ కే ప్లస్

ఎంపిల రాజీనామాలు: ఏది జరిగినా జగన్ కే ప్లస్

పార్లమెంటు సెషల్ చివరి రోజైన ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం ద్వారా  40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును పూర్తి ఆత్మరక్షణలో పడేసాడు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమి జవాబు ఇవ్వాలో కూడా తెలియని అయోమయావస్థలో తెలుగుదేశం నాయకులు అవస్తులు పడుతున్నారు.   

6వ తేదీ రాజీనామాలు చేసినా అవి ఆమోదం పొందవని, ఉపఎన్నికలు రావని తెలుగుదేశం నాయకులు ఎదురుదాడులు మొదలుపెట్టారు.  ప్రత్యేకహోదా కోసం రాజీనామా చేస్తామని జగన్ ప్రకటించటమే జనాలకు కావాల్సింది. తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో ఆడిన డ్రామాలను ప్రజలంతా గమనించారు. మామూలుగా మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడే చంద్రబాబునాయుడు పదిహేను రోజులుగా మీడియా ముందుకు రావడానికే భయపడుతున్నారంటే జగన్ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్ధమైపోతోంది.

వారు ఎదురు దాడులు చేసేకొద్దీ జగన్ కు మైలేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదన్న విషయాన్ని టిడిపి మరచిపోతోంది.  ఇక రాజీనామాల విషయంలో తెలుగుదేశం పూర్తిగా వెనక్కు తగ్గిందన్నది అర్ధమైపోయింది. కేంద్రమంత్రులు, ఎంపీలతో  రాజీనామా చేయించే ఉద్దేశ్యంలో లేరన్న విషయం మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యవహారంతో తేలిపోయింది. వారి వ్యాపారాలు, అవినీతి కేసుల వల్ల అంత ధైర్యం చేయలేరన్న విషయం స్పష్టమైపోయింది.

ఇక బీజేపీ కూడా జగన్ ప్రకటనపై ఏమని సమాధానం చెప్పాలో తోచక గింజుకుంటోంది. జగన్ ను గట్టిగా విమర్శిస్తే ప్రజలకు ఆగ్రహం వస్తుందన్న భయం బిజెపిలో కనబడుతోతంది. ఎందుకంటే ప్రజల మూడ్ కు అనుగుణంగానే ఎంపిల రాజీనామాను జగన్ ప్రకటించారు. ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే అది ప్రత్యేకహోదా కోరికకు వ్యతిరేకం అవుతుంది.

ఆమోదించకుండా పెండింగ్లో వైసిపి కి భయపడ్డట్లు అవుతుంది.  రాజీనామాలు ఆమోదించి వెంటనే ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆ ఎంపీలు గెలిస్తే అది బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు కోలుకోలేని దెబ్బే. అలాగని హోదా ఇస్తాము అని ప్రకటిస్తే ఇక రాబోయే ఎన్నికల్లో వైసిపి స్వీప్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది.  హోదా ఇవ్వకపోయినా, వైసిపి త్యాగాన్ని గుర్తించి ప్రజలు వైసిపికి పట్టే అవకాశాలు ఎక్కువున్నాయి.   

ఏవిధంగా చూసినా రాజీనామా అస్త్రంతో వైసిపి నూటికి నూరుశాతం లభ్ది పొందడమే కాక, తెలుగుదేశం, బీజేపీ లను ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు పార్టీలను నైతికంగా దెబ్బ తీసింది.   

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page