ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం పార్టీలోని కీలక నేతలు వెంటరాగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. జగన్‌ వెంట వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వర ప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది రెడ్డి, రోజా, చెవిరెడ్డి, డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నారాయణ స్వామి, శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి పలువురు పార్టీ నేతలు ఉన్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్‌ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు కూడా వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకున్నట్లు జగన్‌ చెప్పారు. కాగా, ప్రజా సంకల్ప యాత్ర నవంబర్‌ 6న వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. పాదయాత్ర విజయవంతానికి శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి, జగన్ కు విజయకంకణాన్ని కట్టారు.