అమరావతి భూములపై సుప్రీంకెక్కనున్న జగన్ ప్రభుత్వం
అమరావతి రాజధాని ప్రాంతంలో భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించుకుంది.
అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో సేకరించిన స్థలాలను పేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేయడంపై హైకోర్టు ఇచ్ిచన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టుకు ఆశ్రయించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదలు చేసింది. ఆ మేరకు జీవో నెంబర్ 99ని ప్రభుత్వం జారీ చేసింది. సీఆర్డీఎ చట్టం ప్రకారం అక్కడ ఇళ్లనే నిర్మించాలని, ఇళ్ల స్థలాలను ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
దాంతో ముందు ఇంటి స్థలాలను ఇచ్చి ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఇళ్లను నిర్మించి ఇస్తామని తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఆ జీవో జారీ చేసింది.
పేదల ఇళ్ల స్థలాల విక్రయంపై నిషేధం
పేదలకు కేటాయించిన ఖాళీ ఇళ్ల స్థలాల విక్రయంపై వైఎస్ జగన్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆదేశించింది.
ఇంటి స్థలంలో లబ్ధిదారులు కనీసం ఐదేళ్ల పాటు హక్కు కలిగి ఉండాలని నిర్దేశించింది. ఐదేళ్ల తర్వాత మాత్రమే బదలాయింపు విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్ిచన స్థలాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థలాల లబ్ధిదారుల పేర్లు గ్రామ, వారు సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించింది.