జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన ‘‘జగనన్న విద్యా కానుక’’ పథకం తాత్కాలికంగా వాయిదా పడింది.  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించింది.

దీంతో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అక్టోబర్ 5 నాటికి వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు.

సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన రోజే 43 ల‌క్షల మంది విద్యార్థుల‌కు విద్యా కానుక ఇస్తామ‌ని సీఎం జగన్ వెల్లడించారు.ఇందుకోసం మొత్తం రూ.650 కోట్లు ఖ‌ర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.