ఏపీలో సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులకు స్థానచలనం లభించింది. వీరిలో ముగ్గురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సతీశ్ చంద్రకు నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సతీశ్ చంద్ర కీలకపాత్ర పోషించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సతీశ్ చంద్ర బదిలీని పెండింగ్‌లో ఉంచారు. తాజా ఉత్తర్వుల్లో ఆయనకు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

Also Read:నలుగురు సీఎంఓ అధికారులపై జగన్ సర్కార్ బదిలీ వేటు

అలాగే జేఎన్‌వీ ప్రసాద్‌ను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కె.కన్నబాబుకు గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.

సీనియర్ ఐపీఎస్ త్రిపాఠిని డీజీపీకి రిపోర్ట్ చేయాల్సిందిగా పేర్కొనగా.. మరో ఐపీఎస్ ఎన్‌ వీ సురేంద్రబాబును ఎస్‌పీఎఫ్ డీజీగా నియమించారు. ఈ క్రమంలో ఆయన ఇసుక అక్రమ తవ్వకాలు, ఎక్సైజ్ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. 

ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్  ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో సీఎంఓగా ఉన్న ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. 
ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సతీష్ చంద్ర,  చీఫ్ మినిస్టర్‌కు ప్రిన్సిఫల్ సెక్రటరీగా జి. సాయిప్రసాద్,  చీఫ్ మినిస్టర్‌కు సెక్రటరీలుగా ఎం. గిరిజా శంకర్, వి. రాజమౌళి కొనసాగారు.

Also read:భారీగా బదిలీలు: చంద్రబాబు పేషీలోని ఐఎఎస్ లకు నో పోస్టింగ్స్

అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను జిఎడికి అటాచ్ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎంవోలో పనిచేసిన సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్ లకు పోస్టింగులు ఇవ్వలేదు.

యూనిఫాం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న సర్వశిక్ష అభియాన్ ఎస్పీడి గుర్రాల శ్రనివాస రావును జిఎడికి అటాచ్ చేసింది. ఖనిజాభివృద్ధి సంస్థలో పనిచేసిన వెంకయ్య చౌదరిని కూడా జిఎడి అటాచ్ చేసింది. 

కీలకమైన ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్ర సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ అయ్యారు. గతంలో జిఎడికి పంపిన అధికారులకు ఇప్పుడు పోస్టింగులు లభించాయి. పోస్టు కోసం ఎదురు చూస్తున్న శశిభూషణ్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించారు. 

అదే విధంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రంజీత్ బాషాను గిరిజ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. అదే విధంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సాగిలిన షాన్ మోహన్ ను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న గౌతమిని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. ఆమె స్థానంలో పనిచేస్తున్న కోటేశ్వర రావును జిఎడికి పంపించారు