అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసుకు సంబంధించి కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు నివేదికను పంపింది.

యరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా మైనింగ్ కు  పాల్పడినట్టుగా సీఐడీ దర్యాప్తులో తేల్చింది.ఈ నివేదికను ఏపీ హైకోర్టుకు సీఐడీ అందించింది. అయితే ఈ నివేదికపై సీబీఐ విచారణకు కూడ ఏపీ ప్రభుత్వం సంసిద్దతను వ్యక్తం చేసింది.

ఈ మేరకు  హైకోర్టుకు కూడ తెలిపింది. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం  మంగళవారం నాడు కేంద్రానికి నివేదికను పంపింది. అక్రమ మైనింగ్ పై సీఐడీ దర్యాప్తు వివరాలతో పాటు కోర్టు ఆదేశాలను కూడ జతపర్చింది.

ఈ విషయమై కేంద్రం సీబీఐ విచారణకు అనుమతి ఇస్తోందా లేదా అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తనపై సీబీఐ విచారణను మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వాగతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

యరపతినేని అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తు: జగన్ కీలక నిర్ణయం

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి

అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు