మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను హైకోర్టుకు సమర్పించింది ఏపీ ప్రభుత్వం. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను హైకోర్టుకు సమర్పించింది ఏపీ ప్రభుత్వం. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే ఈ బిల్లులు ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. చట్టం రద్దు ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించామని.. శ్రీబాగ్ ఒప్పందాన్నిసైతం ప్రస్తావించింది. మరోవైపు శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత, న్యాయబద్ధత లేదంటున్నారు రైతుల తరపు న్యాయవాదులు. చట్టాలను వెనక్కి తీసుకున్నా మళ్లీ బిల్లు పెడతామనడంపై రాజధాని పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం వాదనలకు సిద్ధమవుతున్నారు న్యాయవాదులు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‍లో ఉన్న బిల్లులను అధ్యయనం చేస్తున్నారు.
కాగా.. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల చట్టాన్ని ఈ నెల 22న ఉపసంహరించుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించిన విషయాన్ని కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మ AP High court అఫిడవిట్ ఇచ్చారు. Three capitals చట్టం ఉపసంహరణ గురించి కూడా వివరించారు. ఈ నెల 23న AP legislative Council లో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా అఫిడవిట్ లో ప్రభుత్వం వివరించింది.వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించినందున తగు ఉత్తర్వులు ఇవ్వాలని ఆ ఆఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం కోరింది.
Also Read:మూడు రాజధానుల చట్టం రద్దు: ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ది బిల్లు-2020 , ఏపీ సీఆర్‌డీఏ రద్దు -2020 బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2020 జూలై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెల రోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులను ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్ ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు.
అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగుతుంది. నిన్న బీజేపీకి చెందిన నెల్లూరు జిల్లాలో ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపిన మరునాడేఏపీ సర్కార్ ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెల 22న నిర్వహించిన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై చేసిన చట్టాలను వెనక్కి తీసుకొంది.
