Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..

కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో Night curfew అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ అంటూ మెసేజ్ లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ  చెక్కర్లు  కొడుతున్నాయి.  దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ys jagan government clarity on night curfew in andhra pradesh
Author
Hyderabad, First Published Jan 8, 2022, 1:56 PM IST

ఆంధ్రప్రదేశ్ : తెలుగు రాష్ట్రాల్లో Corona, Omicron కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది.  రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు 
Corona rules పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు Social media వేదికగా False propagandaతో  చెలరేగిపోతున్నారు.

కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో Night curfew అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ అంటూ మెసేజ్ లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ  చెక్కర్లు  కొడుతున్నాయి.  దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రంలో ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు మెసేజ్లు సర్క్యులేట్ చేసేవారిని గురించి ఆరా తీస్తున్నామని అన్నారు.  అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రోజురోజుకీ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి తెలిసిన వివరాల ప్రకారం. గడిచిన 24 గంటల్లో 840 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,76,868 కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా  మరణించిన వారి సంఖ్య 14,501కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 133 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,59,395కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,849 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,15,29,919కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,972 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 33, చిత్తూరు 150, తూర్పుగోదావరి 70 గుంటూరు 6, కడప 24, కృష్ణ 88, కర్నూలు 23, నెల్లూరు 69, ప్రకాశం 22, శ్రీకాకుళం 25 విశాఖపట్నం 183, విజయనగరం 49, పశ్చిమ గోదావరిలలో 38 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు దేశంలో Corona కేసులు లక్షను దాటాయి. గత 24 గంటల్లో 1.1లక్షల కరోనా  కేసులు నమోదయ్యాయి. కరోనాతో 302 మంది కరోనాతో మరణించారు. కరోనా కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగాయి. కరోనా Omicron కేసులు మూడు వేలకు చేరుకొన్నాయి.  శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు India లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో  వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా రోగులు 30,836 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకొంది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన రోగుల సంఖ్య 4,38,178కి చేరుకొంది.  కరోనా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 3,007కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా ఒమిక్రాన్ కేసుల్లో 1,199 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333,రాజస్థాన్ లో 291,కేరళలో 284, గుజరాత్ లో 204 కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios