Asianet News TeluguAsianet News Telugu

శవాల మీద చిల్లర ఏరుకునే వ్యక్తి, ఆపరేషన్ గరుడ దొంగ చంద్రబాబు:జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ గరుడ అంటూ టీడీపీ చేస్తున్న హడావిడి అంతా ఓ డ్రామా అంటూ కొట్టిపారేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సాయంత్రం మంగళవారం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు. 
 

ys jagan fires on chandrababu naidu
Author
Vizianagaram, First Published Nov 20, 2018, 8:50 PM IST

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ గరుడ అంటూ టీడీపీ చేస్తున్న హడావిడి అంతా ఓ డ్రామా అంటూ కొట్టిపారేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ సాయంత్రం మంగళవారం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు. 

ఆపరేషన్ గరుడపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ఆపరేషన్ గరుడ పేరుతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని అంటున్న చంద్రబాబు ఎందుకు ఫిర్యాదు చెయ్యడం లేదని నిలదీశారు. ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే అసలు గుట్టు బయటపడుతుందన్నారు.  

మరోవైపు చంద్రబాబు వ్యవహార శైలి చాలా వింతగా ఉంటుందంటూ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే వాటిపై కోర్టులకు వెళ్లరు కానీ ఐటీసోదాలు జరిగితే మాత్రం చంద్రబాబు  సుప్రీంకోర్టుకు వెళ్తారంటూ ధ్వజమెత్తారు. తిత్లీ బాధితులను ఆదుకోవడం కంటే పబ్లిసిటీకే ఎక్కువ సమయం కేటాయించారని దుయ్యబుట్టారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో కరువువిలయతాండవం చేస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ప్రజల సొమ్ముతో దేశమంతా తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 

కురుపాం నియోజకవర్గంలో వైద్యసదుపాయాలు కూడా లేవని, వైద్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులు నేటికీ పూర్తికాలేదని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఘాటుగా విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కట్టెకాలేవరకు వైసీపీలోనే,ప్రలోభాలకు లొంగను :పుష్పశ్రీవాణి

 

Follow Us:
Download App:
  • android
  • ios