ఏలూరు: చంద్రబాబునాయుడు పాలనలో ఒక్క ఏడాది కూడ ఒక్క  పంటకు కూడ గిట్టుబాటు ధర లభించలేదని వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ చెప్పారు.

వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు
ఆదివారం నాడు చేరుకొంది. పశ్చిమగోదావరి జిల్లాలో కనీసం
తాగడానికి కూడ మంచినీళ్ళు కూడ లేవన్నారు. రూ. 20 లకే
లీటర్ మినరల్ బాటిల్ నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో బాబు
హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.కానీ, మురికి నీరు ప్రజలు
తాగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
జిల్లాలోని వశిష్ట నదిపై బ్రిడ్జి నిర్మాణం ఏమైందని ఆయన
ప్రశ్నించారు. నాలుగేళ్ళలో బాబు పాలన దారుణంగా
ఉందన్నారు. వైఎస్ఆర్ హయంలో ప్రతి పేదవాడికి ఇళ్ళు
కేటాయించారని ఆయన చెప్పారు. పేదలకు భూ పంపిణీ
చేశారని పేదలు తనతో చెప్పారని జగన్ చెప్పారు.


నాలుగేళ్ళలో పెనుగొండ గ్రామానికి కొత్త ఇంటిని మంజూరు
చేశారా అని బాబును జగన్ ప్రశ్నించారు. జిల్లాలో
తీర్చేందుకు బాబుకు, టిడిపి నాయకులకు పట్టింపు
లేదన్నారు.

జిల్లాలోని గోదావరి నది నుండి ఇసుకను తవ్వుతున్నారని
జగన్ ఆరోపించారు. ఇసుక సరఫరా విషయంలో టిడిపి
నేతలు డబ్బులు దండుకొంటున్నారని ఆయన విమర్శలు
చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రంగం
కుదేలైపోయిందన్నారు. రెండో పంటకు కూడ నీరివ్వని
పరిస్థితి నెలకొందన్నారు.