ఆటో నడిపిన వైఎస్‌ జగన్‌

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్ల మద్దతు ఉంటుందని తెలిపారు. మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ఆటో యూనిఫాం ధరించి ఆటో నడిపారు.