అమరావతి: ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడికి సరిగ్గా ఆరు రోజుల సమయం ఉంది. ఫలితాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. వేసవి కాలం సందర్భంగా సూర్యుడు వేడి ఎలా ఉన్న ఫలితాల వేడి మాత్రం మరింత అగ్గి రాజేస్తోంది. 

అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమదే అధికారం అంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ కంటే వైసీపీలోనే ధీమా ఎక్కువగా కనబడుతోంది. ధీమా ఉంటే సరిపోతుందా మంత్రులు ఎవరు, ఎవరికి ఏయే శాఖలు ఇవ్వాలో అన్నది కూడా నిర్ణయించేశారు. 

ఓలిస్ట్ తయారు చేసి ఇదీ జగన్ డ్రీం కేబినెట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ కాస్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి వర్గంలో తమకు ఛాన్స్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 

కొందరు కార్యకర్తలు అయితే తమ నాయకుడు కాబోయే మంత్రి అంటూ ఫ్లెక్సీలు, స్టిక్కర్లు సైతం వేసేస్తున్నారు. ఈ వ్యవహారంపై జగన్ సీరియస్ గానే స్పందించారు. ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలమని ఫలితాలు వెల్లడయ్యే వరకు అయినా కాస్త సంయమనం పాటించాలంటూ హితవు పలికారు. 

దాంతో ఆనాటి నుంచి నేటి వరకు మంత్రి పదవుల లొల్లి కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా జగన్ డ్రీం కేబినెట్ అంటూ ఒక లిస్ట్ రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఆ లిస్ట్ కూడా చాలా వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు ఉంది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూయులకే పెద్ద పీట వేస్తూ రూపొందించారు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓటమిపాలవుతారో తెలియదు కానీ జగన్ డ్రీం కేబినెట్ కాస్త నమ్మేటట్టు ఉన్న ఆ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి 

స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు 

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి 

మంత్రులు ................శాఖలు
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి     -హోంశాఖ 
2. బొత్స సత్యనారాయణ         - రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు              -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి       -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని                          -భారీ నీటిపారుదల శాఖ
6. గడికోట శ్రీకాంత్ రెడ్డి              -మున్సిపల్ శాఖ
7. తానేటి వనిత                       -స్త్రీ, శిశు సంక్షేమ శాక   
8. పిల్లి సుభాష్ చంద్రబోస్       -పౌర సరఫరాలుశాఖ
9. అవంతి శ్రీనివాస్                  -వైద్య ఆరోగ్యశాఖ
10. కురసాల కన్నబాబు            -విద్యాశాఖ 
11. తమ్మినేని సీతారాం              -బీసీ సంక్షేమం
12. శిల్ప చక్రపాణి రెడ్డి              -అటవీశాఖ 
13. వై. విశ్వేసర్ రెడ్డి                 -న్యాయశాఖ  
14. కోన రఘుపతి                   -దేవాదాయ ధర్మదాయశాఖ 
15. ఆనం రాంనారాయణ రెడ్డి  -పంచాయితీరాజ్
16. మోపిదేవి వెంకటరమణ      -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా                       -విద్యుత్ శాఖ  
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి          -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్                     -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని                           -కార్మిక, రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి                       - సాంఘీక సంక్షేశాఖ 
22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి            -వ్యవసాయ శాఖ మంత్రి
23. అమంచి కృష్ణ మోహన్         -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్               -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి            -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి               -భారీ పరిశ్రమల శాఖ 
 
మెుత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పడమే కాదు ఏకంగా జగన్ డ్రీం కేబినెట్ అంటూ లిస్ట్ రావడం అందులో 26 మందిని మంత్రులుగా ప్రకటించడం వారికి శాఖలు కేటాయించడం కూడా జరిగిపోయింది. ఇకపోతే వైఎస్  జగన్ ప్రకటించిన మర్రి రాజశేఖర్ పేరు లిస్ట్ లో లేకపోవడం విశేషం.