Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన వైసీపీ ప్లీనరీ.. ఎన్నికలపై క్యాడర్‌కు జగన్ ఏం సూచనలు చేశారంటే..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ప్లీనరీలో.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు జగన్ పలు కీలక సూచనలు చేశారు. 
 

YS jagan Directions to party cadre on elections in Ysrcp plenary
Author
First Published Jul 9, 2022, 4:56 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ప్లీనరీలో.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. అయితే తొలి రోజే పార్టీ గౌరవ అధ్యక్ష పదివి నుంచి తప్పుకుంటున్నట్టుగా వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లీనరీలో పార్టీ రాజ్యాంగానికి సవరణలు కూడా చేశారు. పార్టీ అధ్యక్ష పదవిని.. జీవితకాల అధ్యక్ష పదవిగా మార్చారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉన్న పేరును.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)గా మార్చుతూ సవరణ చేశారు.

వైఎస్ జగన్‌ను పార్టీ జీవితాకాల అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. అనంతరం ప్రసంగించిన జగన్.. 13 ఏళ్లలో తాను సాగించిన ప్రయాణం గురించి ప్రస్తావించారు. తనపై ఎన్నో కుట్రలు చేశారని.. కానీ దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలు చేస్తున్నాయని.. దుష్టచతుష్టయం అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు. 

Also Read: సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు.. మొరిగినంత మాత్రానా గ్రామ సింహాలు.. సింహాలు కాలేవు: జగన్

అదే సమయంలో ఎన్నికలకు సిద్దం కావాలంటూ సీఎం జగన్ క్యాడర్‌కు పిలునిచ్చారు. మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశామని చెప్పారు. తన కన్నా చంద్రబాబే ఎక్కవ అప్పులు చేశారని తెలిపారు. గజదొంగల ముఠాకు, మంచి పరిపాలనకు మధ్య తేడాను గమనించాలని కోరారు. గత ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పింది చేశానని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరిన జగన్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. 

ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపేయాలని దుష్టచతుష్టయం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ ముఠాతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనని చెప్పాలన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో మీ ముందుకు వస్తారని జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈనాడు, ఆంధ్రజ్యోగి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేడు.. అసత్యాలు చెప్పడం, వెన్నుపోట్లు పోడవడం మనకు రాదు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది దుష్టచతుష్టయం విష ప్రచారం ఎక్కువ అవుతుంది’’ అని చెప్పారు. 

Also Read: చంద్రబాబులా కాకుండా ఈ మూడేళ్లు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచించాను: వైఎస్ జగన్

‘‘దేవుడు దయతో వచ్చె ఎన్నికల్లో 175 స్థానాలతో తిరిగి వస్తాం. నాకు ఉన్న గుండె ధైర్యం మీరే. కౌరవుల సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. ఈ పార్టీ మీది. జగన్.. మీ అన్న, తమ్ముడు. ప్రతి వైఎస్సార్ కార్యకర్త కూడా నావాడు. రాష్ట్ర భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు నాది బాధ్యత’’ అని జగన్ చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios