Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబులా కాకుండా ఈ మూడేళ్లు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచించాను: వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారు. అనంతరం ప్లీనరీలో జగన్ మాట్లాడుతూ..‘‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అని చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేయడంపై ఈ మూడేళ్లు దృష్టిపెట్టడం జరిగిందని చెప్పారు.

YS jagan Speech At YSRCP Plenary second day
Author
First Published Jul 9, 2022, 3:11 PM IST

‘‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అని చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేయడంపై ఈ మూడేళ్లు దృష్టిపెట్టడం జరిగిందని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారు. అనంతరం ప్లీనరీలో జగన్ మాట్లాడుతూ.. ‘‘విజయవాడ-గుంటూరు మధ్య ఇవాల మహా సముద్రం కనిపిస్తోంది. వర్షం పడుతున్న ఎవరూ చెదరలేదు. ఇది ఆత్మీయులు సునామీ. 13 ఏళ్లుగా ఇదే అభిమానం.. ఇదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. మహా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్ చేస్తున్నాను’’ అని చెప్పారు. 

సీఎం జగన్ ప్రసంగం సాగిందిలా.. ఓదార్పు యాత్ర చేయొద్దన్న పార్టీని వ్యతిరేకించినందుకు నాపై అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. ఆనాడు లొంగిపోయి ఉంటే జగన్ ఇవాళ మీ ముందు ఉండేవాడు కాదు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం 22కి చేరింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు. వైసీపీ ఉండకూడదని, జగన్ కనబడకూడదని కుట్రలు, కుయుక్తులు పన్నారు. కానీ దేవుడు స్క్రిప్ట్ మరోలా రాశారు. మన పక్కనుంచి ఎంతమందిని లాక్కున్నారో 2019 ఎన్నికల్లో వారికి అన్నే సీట్లు వచ్చాయి.  

ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా.. అన్ని అమలు చేస్తూనే ఉన్నాం. చంద్రబాబు మాదిరిగా ప్రతిపక్షంపై ఫోకస్ పెట్టలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాక్కోవాలని ఆలోచన చేయలేదు. మూడేళ్లుగా ఎటువంటి మంచి చేస్తాం, ఎలాంటి పాలన అందిస్తామనే దానిపై ఫోకస్ పెట్టాను. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ఆర్జీ పెట్టుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ఆర్జీ పెట్టుకున్నారు. కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios