రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు కామన్ అయిపోయాయి. గతంలో ఇవే ఆరోపణలు, విమర్శలు హుందాగా ఉండేవి. కాకపోతే ఇపుడే చాలా అసహ్యంగా దిగజారిపోయాయి. ఇక ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే రోత పుడుతోంది. కాకపోతే అక్కడక్కడ కొందరకి మాత్రం ఇటువంటి వాటికి మినహాయింపు ఇవ్వచ్చు. అటువంటి వారిలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు. నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబునాయుడు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారమే రేపాయి. దాంతో తర్వాత జాగ్రత్త పడ్డారు.

ఇదంతా ఎందుకంటే, మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జగన్ పాదయాత్రలో చేశారు. ఆ సందర్భంగా కలిచేడులో చేనేతలతో ఆత్మీయ సదస్సు జరిగింది. సరే, సదస్సన్నాక సమస్యలు, పరిష్కారాలపై చర్చలు తప్పవు కదా? అదే సమయంలో జగన్ చేనేతలకు పలు హామీలను కూడా గుప్పించారు.

అయితే, ఇక్కడ ఓ విషయం గమనించాలి. చంద్రబాబులాగ అవసరానికి హామీలిచ్చేసి తర్వాత మరచిపోవటం తన నైజం కాదన్నారు. పోయిన ఎన్నికల్లో చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటి? ఎంత వరకూ నెరవేరాయన్న విషయంలో జనగ్ మండిపడ్డారు. అదే సమయంలో చేనేత కార్మికులో ఒకరు మాట్తాడుతూ తమ సమస్యలను ప్రస్తావించేందుకు చట్టసభల్లో ఎవరూ లేరని అన్నారు.  

వెంటనే జగన్ స్పందిస్తూ కర్నూలు ఎంపి బుట్టా రేణుక విషయాన్ని గుర్తుచేశారు. ‘చేనేతల సమస్యలను ప్రస్తావిస్తారనే బుట్టా రేణుకమ్మకు టిక్కెట్టు ఇచ్చా’మన్నారు. ఎంపి బుట్టా రేణుకమ్మ కూడా చేనేత వర్గాలకు చెందిన వ్యక్తే అని జగన్ అన్నారు. భవిష్యత్తులో మరో వ్యక్తికి టిక్కెట్టు ఇస్తామని కూడా చెప్పారు. అంతే కానీ రేణుక గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదికూడా ఎంపి గురించి మాట్లాడుతూ ‘బుట్టా రేణుకమ్మ’ అనే సంభోదించారు. వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించినా కూడా జగన్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.