అక్రమాస్తుల కేసు.. ఛార్జ్‌షీట్ నుంచి నా పేరు తొలగించండి: సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్

అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తన పురు తొలగించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

Ys jagan case for housing projects adjourned to september 3

అక్రమాస్తుల కేసుల్లోని ఏపీహెచ్‌బీ గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్ షీట్ నుంచి తన పురు తొలగించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని జగన్ పిటిషన్‌లో తెలిపారు. అదే ఛార్జ్ షీట్‌లో రెండో నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తన పేరు తొలగించాలని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. మరోవైపు పెన్నా కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు శామ్యూల్, వి.డి.రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios