‘రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపిలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దాం’..ఇవి తాజాగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రేణుమాల గ్రామంలో మహిళా సదస్సులో మాట్లాడుతూ, అందరూ కలిసి పోరాటం చేద్దామంటూ చంద్రబాబుకు చెప్పారు. ప్రత్యేకహోదా కోసం వైసిపి చేస్తున్న పోరాటంలో కలిసి రావాలంటూ చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఎంపిలందరూ ఒక్కమాట మీదుంటే కేంద్రం దిగిరాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో  టిడిపి కూడా కలసి వస్తే తక్షణమే రాజీనామాలు చేద్దామంటూ చంద్రబాబుకు జగన్ ప్రతిపాదన పంపారు.