జగన్ ట్విస్ట్ ఇస్తాడని అప్పుడే చెప్పా, హైకోర్టు ఒకే కానీ..: బీజేపీ ఎంపీ కామెంట్స్
రాజధాని మార్చే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని తానే రెండు నెలల క్రితం చెప్పినట్లు గుర్తు చేశారు జీవీఎల్ నరసింహారావు. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలన్నది తమ అభిమతమని చెప్పుకొచ్చారు. అంతేగానీ ఆర్థిక, రాజకీయ కోణంలో నిర్ణయాలు ఉండకూడదన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం వైయస్ జగన్ చేసిన ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అన్న అంశం సముచితంగా లేదని చెప్పుకొచ్చారు.
ఇకపోతే కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటును తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బీజేపీతోపాటు కేంద్రప్రభుత్వం కూడా చేసిందని చెప్పుకొచ్చారు. రాజధాని ఒక చోట, హైకోర్టు మరోచోట ఉన్న దాఖలాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు జీవీఎల్ నరసింహారావు.
ఆయన తాకట్టుపెడితే మీరు ఏకంగా అమ్మేస్తున్నారు: జగన్ ప్రకటనపై కన్నా ఫైర్...
ముఖ్యమంత్రి వైయస్ జగన్ శాసన సభలో ప్రకటన చూసిన తర్వాత రాజధానిపై క్లారిటీ వచ్చిందన్నారు. అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే పరిమితం చేశారంటూ మండిపడ్డారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు జీవీఎల్.
ఇకపోతే కేంద్రప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ సైతం వికేంద్రీకరణపై పలు సూచనలు చేసిందన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరగడం వల్ల మిగిలిన ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
మీకంటే మేమే బెటర్.. జగన్ కు కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, : రామ్మోహన్ నాయుడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకరించడం వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందన్నారు. అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతిపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిని చట్టసభలు వరకే పరిమితం చేస్తే ఆ తర్వాత ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారని వారిని ఆదుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి పరిహారాన్ని ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రకటనతో ప్రరజలు గందరగోళానికి గుయ్యారని చెప్పుకొచ్చారు.
ఇకపోతే రాజధాని మార్చే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని తానే రెండు నెలల క్రితం చెప్పినట్లు గుర్తు చేశారు జీవీఎల్ నరసింహారావు. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలన్నది తమ అభిమతమని చెప్పుకొచ్చారు. అంతేగానీ ఆర్థిక, రాజకీయ కోణంలో నిర్ణయాలు ఉండకూడదన్నారు. రాజధాని, అమరావతిపై అన్నివర్గాల్లో చర్చజరగాల్సిన అవసరం ఉందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.
లిమిట్ దాటేశారు, మీది తుగ్లక్ మైండ్ సెట్: జగన్ పై మాజీమంత్రి ఫైర్.