అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. రాజధానిపై జగన్ నిర్ణయాలు కక్షపూరితంగా ఉన్నాయని ఆరోపించారు. 

జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆరోపించారు. తుగ్లక్‌ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు. 

జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు చూపుతాయని హెచ్చరించారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కష్టమేనని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు రాకుండా ప్రైవేట్‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే ఏం లాభమని ప్రశ్నించారు.  

 ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్.

తమ ప్రభుత్వం సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్నారంటూ విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి అని దాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. 

ఈ నిర్ణయాలను పరిశీలిస్తే ఎవరి మైండ్‌సెట్ ఎలా ఉందో తెలుస్తోందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాకపోతే వేరే చోట ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలే కానీ 3 రాజధానులు అంటూ ప్రజలను గందరగోళానికి గురి చేయోద్దని సూచించారు.  

తిండి లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకొచ్చి: మూడు రాజధానులపై పవన్ స్పందన...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో చట్టసభలు మాత్రమే ఉంటే అసెంబ్లీ తర్వాత ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. రాజధాని అమరావతికి మార్చడంతో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారని వారు ఇప్పుడు విశాఖపట్నంకు మారాలా అంటూ తిట్టిపోశారు.

రాజధాని మార్పుపై భూములు ఇచ్చిన రైతుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోందని యనమల అన్నారు. ఇప్పటికే లిమిట్‌ దాటిపోయారని రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాళ్లు కూడా లేరని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. 

తాము అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకం కాదని పరిపాలన వికేంద్రీకరణకు మాత్రం వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా జగన్ రాజధానిపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. 

ఇకపోతే సీఎం జగన్ ప్రకటనపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడులు వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. 

జగన్ కి జై కొట్టిన టీడీపీ సీనియర్ నేత...

తాము పరిపాలన వికేంద్రీకరణకు అంగీకరించబోమని, అభివృద్ధి వికేంద్రీకరణకు మాత్రం సహకరిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. జగన్ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడతారే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు విమర్శించారు. 

ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు అయితే జగన్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును గంటా స్వాగతిస్తే, కర్నూలులో హైకోర్టు ఏర్పాటును కేఈ స్వాగతిస్తున్నారు. 

జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ కరువు, మీకంటే మేమే బెటర్: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు..