తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మెహన్ నాయుడు. చంద్రబాబునాయుడుపై కోపంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. బాబుపై కోపంతో రాజధానిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. 

ఏపీ రాజధానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిని చేస్తామని ఇప్పటికైనా ప్రకటన చేస్తారా? అంటూ నిలదీశారు. ఏపీ రాజధానిపై ఇప్పటికే అనేక సందేహాలు నెలకొన్నాయని దానిపైనే క్లారిటీ ఇవ్వకుండా తాజాగా మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటించడం ఏంటని నిలదీశారు.  

నాడు రాజధానిగా అమరావతిని జగన్ ఒప్పుకున్నారు.. ఇప్పుడేమో ఇలా: అచ్చెన్నాయుడు..

జగన్ గందరగోళ ప్రకటనలతో రాష్ట్రాన్ని నష్టపరుస్తారేమోనన్న ఆందోళన కలుగుతుందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్నినాశనం చేస్తారని బాధగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. 
 
6 నెలలుగా వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు ఏం సాధించారని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిలో వైసీపీకి చెందిన 22 మంది ఎంపీల పాత్ర ఏమైనా ఉందా అంటూ నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి పోరాటాలు చేశారో చెప్పాలని నిలదీశారు. 

ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా సాధిస్తాం, కేంద్రం మెడలు వంచుతాం అంటూ గొప్పలు చెప్పిన వైసీపీ ఇప్పటి వరకు ఏమీ సాధించలేదని అన్ని రంగాల్లో ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 

గంటాకు వరంగా జగన్ నిర్ణయం: సీఎం పై ప్రశంసలు అందుకేనా...

ముగ్గురు ఎంపీలు ఉన్న టీడీపీ తరుపున రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి నిరంతరం పోరాటం చేస్తూన్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సీఎం జగన్ కు కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 

మాజీ సీఎం చంద్రబాబు మీద కోపాన్ని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను చూస్తే ప్రజలు అస్యహించుకుంటున్నారని, మంత్రులు అసభ్య పదజాలంతో మాట్లాడటం సరికాదంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు సూచించారు. 

జగన్ కి జై కొట్టిన టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ..