అమరావతి: జాతీయ మీడియాలో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తాకథనాలు, సంపాదకీయాలు వస్తున్నాయి. తీవ్రమైన వ్యాఖ్యలతో ఆ కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ కథనాలను, సంపాదకీయాలను ఉంటకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు ట్విట్టర్ లో జాతీయ మీడియా కథనాలను జత చేస్తున్నారు. 

తాజాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జాతీయ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. జాతీయ మీడియాలోని కతనాలను, సంపాదకీయాలను తెలుగులోకి అనువాదం చేసి వాటిని పోస్టు చేస్తూ జాతీయ మీడియా కథనాలను జత చేస్తున్నారు. 

Also Read: ప్రశాంత్ కిశోర్ టీమ్ కి జగన్ పార్టీ చెల్లింపులు ఎంతో తెలుసా?

కాగా, జాతీయ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను జగన్ నియమించుకున్నారు. ఆయన జాతీయ మీడియా సలహాదారుగా ఉన్నప్పటికీ జాతీయ మీడియాలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తాకథనాలు రావడంపై జగన్ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. దాంతో జాతీయ మీడియా వ్యవహారాలను చూడడానికి ఐ క్యాప్ అధినేత ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇక మీదట జాతీయ మీడియా వ్యవహారాలు చూస్తుందని చెబుతున్నారు జగన్ ప్రభుత్వానికి సబంధించిన, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలకు సంబందించిన విషయాలను ప్రశాంత్ కిశోర్ టీమ్ చూస్తుందని చెబుతున్నారు. 

Also Read: ఏపిలో ఏం జరుగుతోంది: ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మ ల కథ!!