Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో ఏం జరుగుతోంది: ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మ ల కథ!!

వైఎస్ జగన్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎపీలో ప్రశాంత్ కిశోర్ చురుగ్గా పనిచేస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు సలహాదారుగా ఆయనకు సన్నిహితుడైన రాబిన్ శర్మ పనిచేస్తున్నారు. దీని వెనక లాజిక్ ఏమిటనేది ప్రశ్న.

Prashant Kishore with YS Jagan: Robin Sharma with Chandrababu
Author
Amaravathi, First Published Oct 29, 2019, 6:12 PM IST

గత కొద్దీ రోజులుగా ఏపీ లోని సోషల్ మీడియా లో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ మ్యాజిక్కులతో లాజిక్కులతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్... అదే పీకే మ్యాజిక్కులకు, లాజిక్కులు తలొగ్గుతుందా లేదా అతను చేసే రాజకీయ మాయలకు ప్రభావితం అవుతుందా అనేవి ఆసక్తికర పరిణామాలుగా మారాయి. ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో జగన్ తో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. 

కానీ ఇప్పుడు ఆ ఒప్పందం ముగిసిపోయిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం కీలక పాత్రను పోషించాలనుకుంటున్నాడు. సరే పోషించినా పర్లేదు ఎందుకంటే వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావటానికి కృషి చేశాడు కాబట్టి. కానీ రాబిన్ శర్మ అనే తన సహచరుణ్ణి ఎందుకు టీడీపీ పార్టీ కి సలహాదారునిగా పంపించాడు. ఎందుకు అటు ఇటు రెండు పార్టీలకు చెక్ పెడుతున్నాడు అనేది ఒక అర్ధం కాని విషయం.

పీకే ఇటు ప్రభుత్వంలో, అటు ప్రతి ప్రతి పక్షంలో తానే కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నాడా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. తన సహచరునితో టీడీపీ ఒప్పందం కుదుర్చుకునేలా చేసి అటు ప్రతిపక్షంలోను, ఇటు తన టీం సభ్యులను ప్రభుత్వంలో నియమించడం ద్వారా అటు అధికార ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించాలని అనుకుంటున్నాడు.

ఏది ఏమైనా వీళ్లిద్దరు పీకే రాబిన్ శర్మ అటు ఇటు వ్యవహరిస్తూనే ఢిల్లీ లో కలుసుకుంటూ అటు టిడిపి పని తీరుపై  ఇటు ప్రభుత్వ పని తీరుపై సమాచారాన్ని పంచుకుంటూ ఇద్దరు కలిసి ఇరు పార్టీలను తికమకపెడుతున్నట్టుగా అనిపిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios