వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే... వారి ప్రేమకు యువతి తల్లి అంగీకరించలేదు. దీంతో...తాను ప్రేమించిన అమ్మాయి తనకు దూరమౌతుందని అతను భయపడిపోయాడు. వేరే పెళ్లి చేస్తారేమో అని భయంతో... ప్రియురాలిని చంపి.. తాను కూడా  చనిపోదామని అనుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి గొంతు కోశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....  చిలకలూరి పేటకు చెందిన చైతన్య, అఖిల్ అనే యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరిపెళ్లికి... చైతన్య తల్లి అంగీకరించలేదు. దీంతో... అఖిల్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో చైతన్య తల్లి ఇంట్లో లేని సమయంలో...  అఖిల్ అక్కడికి వెళ్లాడు. వెంటనే... కత్తి తీసుకొని... చైతన్య గొంతు కోసి... అనంతరం తన గొంతు కోశాడు.

కాగా... గమనించిన స్థానికులు... ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని... ఇద్దరూ ప్రాణాపాయం తప్పిందని చెప్పారు.