ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. మద్యం ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఇటీవల ఓ యువకుడు సీఎం జగన్ పై విమర్శలు చేశాడు. ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా.. ఆ దళిత యువకుడు హఠాన్మరణం చెందడం గమనార్హం. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం సోమల మండలం కామిరెడ్డివారిపల్లె పంచాయతీ బండకాడలోని దళితవాడకు చెందిన ఓం ప్రతాప్‌(32) పది రోజుల కిందట మదనపల్లెలోని ఒక మద్యం షాపులో బీరు బాటిల్‌ కొనుగోలు చే శారు. బాటిల్‌పై ధర రూ.140 ఉంటే షాపులో రూ.230కి విక్రయించారు. దీంతో ఓం ప్రతాప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరలను ఇంత భారీగా ఎందుకు పెంచుతున్నారంటూ షాపు ముందే నిలబడి సంబంధిత ప్రభుత్వశాఖలను ప్రశ్నించారు. అదేసమయంలో ఆవేశంలో సీఎం జగన్‌ను నిందించారు. ఈ నేపథ్యంలో ఓం ప్ర తాప్‌ స్నేహితులు ఈ విషయం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇదిలావుంటే, ఓం ప్రతాప్‌ సోమవారం హఠాత్తుగా మరణించడం తీవ్రకలకలం రే పింది.

సీఎం జగన్‌ను నిందించడం వల్లే వైసీపీ నేతలు బెదిరించారని, వారికి భయపడే ప్రతాప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ప్ర చారం జరగడంతో బుధవారం వెలుగు చూసింది. అయితే.. కుటుంబసభ్యుల వాదన మాత్రం మరోలా ఉందిద. అనారోగ్యం కారణంగానే చనిపోయాడని  చెబుతున్నారు. ఓం ప్రతాప్ ని ఎవరూ బెదిరించలేదని... ఆత్మహత్యకు పాల్పడలేదని చెబుతున్నారు.