వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.