సారాంశం
సోదరుడి భార్యతో కలిసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
ఒంగోలు : వదిన, మరిది కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కారణమేంటో తెలీదుగానీ వదినా మరిది రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నారు. రైలు పట్టాలపై పడివున్న వారి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మహత్యల విషయం వెలుగులోకి వచ్చింది.
ఆత్మహత్యకు పాల్పడిన వదినా మరిది ప్రకాశం జిల్లా సైదాపురం మండలానికి చెందినవారిగా తెలుస్తోంది. సూరేపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
కుటుంబ కలహాల కారణంగానే వదినా మరిది సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో గొడవ జరగడంతో బయటకు వచ్చిన ఇద్దరు ఆత్మహత్యకు సిద్దమయ్యారు. దీంతో సూరేపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.
Read More ఆచంటలో పడవ బోల్తా: ఇద్దరు యువకుల గల్లంతు
రైలు పట్టాలపై మృతదేహాలు పడివుండటం గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)