ఆచంటలో పడవ బోల్తా: ఇద్దరు యువకుల గల్లంతు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వద్ద పడవ బోల్తా పడడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమాలపురం వద్ద గోదావరి నదిలో మంగళవారంనాడు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పడవలో లంక నుండి కొబ్బరి బొండాలు తీసుకువస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బోటులో కొబ్బరి బొండాల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా పడవ బోల్తా పడిందని సమాచారం. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.