రెండుసార్లు అబార్షన్, వేధింపులు.. ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఆ ఏడుగురే కారణం.. యువతి సెల్ఫీ వీడియో కలకలం..

మంగళగిరిలో కనిపించకుండా పోయిన మహిళ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాను ఆత్హహత్య చేసుకోబోతున్నానని ఆమె సెల్పీ వీడియోను పోలీసులకు పంపింది. 

young woman went missing in mangalagiri, sent selfie video to police

గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ Selfie video కలకలం రేపింది. కనిపించికుండా పోయిన ఓ యువతి సెల్ఫీ వీడియో అనుమానాలను రేకెత్తిస్తోంది. Pallapu Triveni అనే యువతి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ కాసేపటికే త్రివేణి పోలీసులకు సెల్ఫీ వీడియో పంపించింది. తాను Suicide చేసుకోబోతున్నా అని ఆ వీడియోలో ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన చావుకు ఏడుగురు కారణమంటూ వారి పేర్లను వెల్లడించింది. వారంతా తనను చాలా  వేధించారని తనకు రెండు సార్లు అబార్షన్ చేయించారు అని వాపోయింది.

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ‘గుంటూరు రూరల్ ఎస్పీ గారికి నమస్కారం.. నేను పడిన కష్టం జీవితంలో ఏ అమ్మాయి పడకూడదు.  రెండుసార్లు ప్రెగ్నెన్సీ తీయించారు.  నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. చివరికి నన్ను ఇలా చేశారు. వారందరికీ ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నా. ఆ ఏడుగురు నా చావుకు కారణం’ అని సెల్ఫీ వీడియోలో త్రివేణి  ఆవేదన వెళ్లగక్కింది.

వీడియో వెలుగులోకి రావడంతో.. ఈ వీడియో ఆధారంగా త్రివేణి ఎక్కడ ఉందో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ వీడియోలో ఆమె చెప్పిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. త్రివేణి సెల్ఫీ వీడియో చూసిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదిలా ఉండగా, శ్రీసత్యసాయి జిల్లాలో తనను వేధిస్తున్న YCP Councilor మీద వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. Sri Sathyasai District పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను Liquorనికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్థరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు. 

దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుగొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు బుధవారం  పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఓరాజకీయపార్టీకి చెందిన నాయకుడు minar girlపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్లో జరిగింది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13ఏళ్ల బాలికపై జాంబాగ్ కు చెందిన మజ్లీస్ నాయకుడు రఫిక్ rape attemptకి పాల్పడ్డాడు. పటేల్ నగర్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉండే రఫీక్ బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగికదాడికి యత్నించాడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబసభ్యులకు బాలిక విషయం తెలపడంతో రఫిక్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Pocso act కింద కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios