పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మా కంపనీలో ఉద్యోగం చేసే పార్మాసిస్ట్ సౌజన్య(34) వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఇలా ఇంటివద్ద నుండే పని చేస్తున్న ఆమె సడెన్ గా ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు కు చెందిన సౌజన్య హైదరాబాద్ లో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది. అయితే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా స్వస్థలం ఏలూరు నుండే విదులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలోఇ బలవన్మరణానికి పాల్పడింది. 

అయితే తమ కూతురి ఆత్మమత్యకు బాలు అనే స్థానిక జనసేన నాయకుడే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ ఆత్మహత్యకు ముందు సౌజన్య ఓ సెల్పీ వీడియో రికార్డ్ చేసినట్లు... ఇందులో తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొందని తెలుస్తోంది. 

యువతి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.