తన కూతుర్ని చూశావంటూ ఓ మహిళ పక్కింటి యువకుడిని విపరీతంగా తిట్టింది. దీనికి తోడు ఆ యువతి అన్న స్నేహితులతో కొట్టించాడు.. దీంతో అవమానం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.
తన కూతుర్ని చూశావంటూ ఓ మహిళ పక్కింటి యువకుడిని విపరీతంగా తిట్టింది. దీనికి తోడు ఆ యువతి అన్న స్నేహితులతో కొట్టించాడు.. దీంతో అవమానం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెడితే కనిగిరి పట్టణం పాతూరు మంగలిమాన్యంలో నివాసం ఉంటున్న రామకృష్ణ (22) తన ఇంటి డాబా మీద ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. అయితే తన కూతుర్ని చూస్తున్నాడనుకుంది పక్కింటి మహిళ. ఇంటిపైకి వచ్చి ఆ యువకుడిని దుర్బాషలాడింది. దీనికితోడు ఆ అమ్మాయి అన్న రామకృష్ణను జూనియర్ కాలేజీ వద్దకు తీసుకెళ్లి తన స్నేహితులతో కొట్టించాడు. ఇంకోసారి ఇలా చేస్తే చంపుతామని బెదిరించాడు. దీంతో రామకృష్ణ అవమానం ఫీలయ్యాడు. దీనికి తోడు భయపడి గత నెల 12న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు మొదట స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కందుకూరు, ఒంగోలు, గుంటూరు ఆస్పత్రిలకు తరలించారు. అయినా పరిస్థితి విషమించి డిసెంబర్ 29న రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. రామకృష్ణను అవమానించి అతడి మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలంటూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఆందోళనకారులకు ప్రజా సంఘాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రామిరెడ్డిలు వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మృతుడి కుటుంబ సభ్యులు చిన్న, కృష్ణ, ఓబయ్య, నారాయణ, నాగార్జున, అచ్చమ్మ, వరలక్ష్మి, ఐక్యవేదిక నాయకులు పీసీ కేశవరావు, వరలక్ష్మి, వెంకలక్ష్మి, మైమూన్, గురవయ్య, అశోక్ పాల్గొన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 9:44 AM IST