గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సరావుపేట మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతిని కిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు. వినుకోండ ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి.. అనూష గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే యువతి మరో యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందనే అనుమానంతో ఆమెను హత్య చేశాడు విష్ణువర్థన్. హత్య చేసిన తర్వాత నిందితుడు నరసరావుపేట పీఎస్‌లో లొంగిపోయాడు.

మృతురాలు స్థానిక కళాశాలలో బీఎస్సీ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.