కంచికచర్ల: అధికార పార్టీ నాయకుల క్రూరత్వానికి పరిటాలలో యువకుడు బలయ్యాడని మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఆరోపించారు. పరిటాల నేషనల్ హైవే పై మృతుడు మున్నంగి రాజశేఖర్ రెడ్డి మృతదేహంతో ఆమె ఆందోళన చేపట్టారు. అతడి మృతికి కారణంమైన అధికార పార్టీ నాయకులూ మరియు పోలీసులపై కేసులు నమోదు చేసి చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ మృతుడి బంధువులు,  గ్రామస్థులతో కలసి పరిటాల జాతీయ రహదారిపై సౌమ్య రాస్తారోకో చేసారు. 

ఈ సందర్బంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ... పరిటాల గ్రామంలో  పేకాట అడుతున్నారు అనే కారణంతో రెండే రోజుల క్రితం ఏడుగురిని కంచికచర్ల పోలీసులు తీసుకుని వెళ్లి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు మరియు బైక్ లను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత వారిని మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించారని...అయితే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన వారు తమ పార్టీ వారే అయినప్పటికీ అధికార పార్టీ వారు పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన కంచికచర్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు వారిని విడిపించారు అని ఆమె తెలిపారు. 

వారిని తెలుగుదేశం పార్టీ నాయకుడు విడిపించడంతో కంచికచర్ల మండలంలో ఒకే ఒక్క నాయకుడు కోగంటి బాబు అంటూ మృతుడు తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడని... ఇది అధికార పార్టీ నాయకులు మార్తా శ్రీను, చింత రవిలకు  ఆగ్రహం కలిగించిందని అని ఆమె తెలిపారు.

 ఇలా అతడిపై కోపాన్ని పెంచుకున్న పరిటాల వైసిపి నాయకులు తమ పలుకుబడి ఎక్కడ తగ్గుతుందో అన్న భయంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తిరిగి వారిని పోలీస్ స్టేషన్ కి పిలిపించారన్నారు. మృతినిపై హింసకు  పోలీస్ వారిని పురిగోల్పినట్లు తెలిసిందన్నారు.  

ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని రాజశేఖర్ విజయవాడ వద్ద కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని... అతడి పరిటాల అధికార పార్టీ నాయకులూ చింతా రవి, మార్త శ్రీను మరియు వారికీ సహకరించిన పోలీసు లే కారణమని దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డి  మృతికి కారణమైన వారందరిని అరెస్ట్ చేయాలనీ, మృతుని  కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని  ఇవ్వాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.