Asianet News TeluguAsianet News Telugu

Year Roundup 2019: గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థతో సత్ఫలితాలు

దేశ చరిత్రలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల విప్లవంను సృష్టించింది. కనీవినీ ఎరగని రీతిలో... నిర్ధిష్ట కాలపరిమితిలోనే లక్షలాధి మంది యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

Year Roundup 2019: AP CM Jagan Reddy launches volunteer system
Author
Amaravati, First Published Dec 29, 2019, 4:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశ చరిత్రలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల విప్లవంను సృష్టించింది. కనీవినీ ఎరగని రీతిలో... నిర్ధిష్ట కాలపరిమితిలోనే లక్షలాధి మంది యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు శాశ్వత ఉద్యోగాలను అందించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతేకాదు పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలన్న మహాత్మాగాంధీ ఆశయాలను సాకారం చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రాణం పోసింది.

సంక్షేమాన్ని, అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే సచివాలయ వ్యవస్థతో పాలనలో కీలక మార్పులకు నాంది పలికింది. రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాధి మంది ప్రజలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా విన్న వైఎస్ జగన్ వ్యవస్థలోని లోపాలను అవగతం చేసుకున్నారు.

పరిపాలనలో కీలకమైన పంచాయతీ వ్యవస్థ బలహీనంగా మారడం వల్ల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల, డివిజన్, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని సమూలంగా మార్చాలని ఆయన సంకల్పించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు మరింత చేరువ చేయాలంటే... పాలన గ్రామ స్థాయిలో పటిష్టం కావాలని నిర్ణయించారు. దీని నుంచే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు బీజాలు పడ్డాయి.

Also Read:Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

స్థానిక పాలనతోనే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించిన మహాత్ముడి ఆశయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునాదులు వేసింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 1993లో రాజ్యాంగానికి 73, 74 సవరణలను చేశారు. అయినప్పటికీ నేటికీ విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో బదిలీ కాలేదు.

కీలకమైన గ్రామపంచాయతీల్లో సిబ్బంది కొరత, వనరుల లేమి, సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 
సచివాలయ వ్యవస్థతో పాలనలో సంస్కరణలు:

గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాలనను ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరువ చేయాలనే సంకల్పంతో జగన్ రాష్ట్రంలో 2019 అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి నాడు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్బంగా సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకమైన, అవినీతిరహిత పాలనను ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ సీఎం ప్రకటించారు. 

Also Read:అమరావతి: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ కమిటీ

గ్రామ స్థాయిలో పౌర సేవలను అందించడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ’’నవరత్నాలు’’ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం, గ్రామస్థాయి లో ప్రభుత్వ సేవలను అందించే విభాగాలను సమన్వయం చేయడం, వివిధ శాఖల వార్షిక ప్రణాళికల రూపకల్పన, సకాలంలో అమలు చేయడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆన్ లైన్ సేవలను సచివాలయాల ద్వారా అందించడం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను చేరవ చేయడం వంటి కీలకమైన విధులను సచివాలయాలు నిర్వహిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ సచివాలయంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల్లో రెండువేల కంటే తక్కువ జనాభా వున్నా కూడా సచివాలయాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,065 గ్రామ పంచాయతీలకు అనుబంధంగా 11,158 గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాయి.

500 రకాల సేవలను ప్రజలకు అందించడం, దరఖాస్తు చేసిన 72 గంటల్లో సమస్యను పరిష్కరించే జవాబుదారీ తనం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును ఆదర్శంగా మారుస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలలో సోషల్ ఆడిట్ కు సచివాలయ వ్యవస్థలో పెద్దపీట వేశారు. 

జిల్లా    మండలాలు    గ్రామ పంచాయతీలు    గ్రామ, వార్డు సచివాలయాలు

శ్రీకాకుళం        38        1148            835
విజయనగరం        34        921            664
విశాఖపట్నం        39        925            739        
తూ.గో జిల్లా        62        1072            1271
ప.గో. జిల్లా        48        909            938
కృష్ణాజిల్లా        49        980            845
గుంటూరు        57        1031            872
ప్రకాశం            56        909            881
నెల్లూరు            46        940            665
అనంతపురం        63        1029            896
వైఎస్ఆర్ కడప        50        791            663
కర్నూలు        53        909            881
చిత్తూరు            65        1373            1035

మొత్తం            660        13,065            11,158
.........

రాష్ట్ర వ్యాప్తంగా 1,34,717 శాశ్వత ఉద్యోగాల కల్పన
కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ శాఖలోని లైన్ మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 1,34,717 శాశ్వత ఉద్యోగాలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కొత్త ఆశలను చిగురింప చేసింది. గ్రామ సచివాలయాల పరిధిలో 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల పరిధిలో 31,640 పోస్టులు, ఎపి ట్రాన్స్ కో పరిధిలో 7989 లైన్ మెన్ పోస్ట్ లను ప్రకటించారు.

మొత్తం పద్నాలుగు రకాల ఉద్యోగాల కోసం ప్రభుత్వం 2019 జూలై 26వ తేదీన నోటిఫికేషన్ లను జారీ చేసింది. అత్యంత పటిష్టంగా, పూర్తి పారదర్శకతతో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు 2019 సెప్టెంబర్ నెలలో ఎనిమిది రోజుల పాటు ప్రభుత్వం పరీక్షల ప్రక్రియను నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 19,50,630 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

వీరిలో 9,12,830 మంది అర్హత సాధించారు. అర్హులైన వారిలో రిజర్వేషన్, రోస్టర్, లోకల్ స్టేటస్ నిబంధనల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అర్హులైన 1,20,006 మంది అభ్యర్ధులకు 2019 డిసెంబర్4వ తేదీన నియామక పత్రాలను అందచేశారు. ఒకే ఉద్యోగ నియమాక ప్రక్రియ ద్వారా 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకుని, వారిలో 19.50 లక్షల మంది పరీక్షలు రాసి, 1.20 లక్షల మంది ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవడం దేశ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నమోదయ్యింది. 

ఉద్యోగాల భర్తీలో వెల్లివిరిసిన సామాజిక సమతుల్యత
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో రాష్ట్రప్రభుత్వం సామాజిక సమతూల్యతకు  పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు మొత్తం పోస్ట్ ల్లో యాబైశాతం రిజర్వేషన్లను అమలు చేసింది. వీటిల్లోనూ మహిళలకు యాబైశాతం రిజర్వేషన్ ను వర్తింప చేసింది. దీనితో మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 64శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ అభ్యర్ధులకే అవకాశం లభించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 68,847 మంది బిసిలు, 27,518 మంది ఎస్సీలు, 15,720 మంది ఎస్టీ అభ్యర్ధులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా నియామక పత్రాలను అందుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బడుగు వర్గాలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం రాష్ట్ర చరిత్రలోనే ఇది కొత్త రికార్డును సృష్టించింది. 

గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయికే ప్రభుత్వ పథకాలు
గ్రామ సచివాలయ వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువతను నెలకు 5వేల రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్లుగా పనిచేసేందుకు నియామకాలను చేపట్టింది.

Also Read:జగన్ కు వైసీపీ ఎంపీ షాక్: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై చంద్రబాబును వెనకేసుకొచ్చిన రఘురామకృష్ణం రాజు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యాబై కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు మూడు లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతినెలా రేషన్సరుకులను కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా కార్డుదారుల ఇళ్లకే అందచేసే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ప్రభుత్వం అందించే అన్ని పథకాలకు కూడా వాలంటీర్ల ద్వారా దరఖాస్తులను సచివాలయాలకు అందచేసేందుకు చర్యలు చేపట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios