అమరావతి: ఏపీని సమగ్రంగా అభివృద్ది చేసే అంశంపై  ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో హై పవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ  విషయమై జీఎన్ రావు కమిటీ ఇప్పటికే ఏపీ సీఎం కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదికను ఇవ్వనుంది.

ఈ విషయమై జీఎన్ రావు కమిటీ ఇప్పటికే ఏపీ సీఎం కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదికను ఇవ్వనుంది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ వచ్చే ఏడాది జనవరి 3వ, తేదీన  నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

Also Read:చంద్రబాబుకు షాక్: సీబీఐకి అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్?

ఈ నెల 27వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో రాజధానిపై ఇప్పటికిప్పుడే తొందరలేదని సీఎం జగన్  మంత్రులకు చెప్పారు.అంతేకాదు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సెల్టెన్సీ కమిటీ నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏపీ హైపవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు.

Also Read:చట్టపరంగా ఏదైనా చేసుకో.. నీ దయాదాక్షిణ్యాలపై లేను: జగన్‌కు బాబు సవాల్

కేబినెట్‌లో ప్రకటించినట్టుగానే హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటీకి ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛైర్మెన్‌గా ఉంటారు. ఈ కమిటీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకతోటి సుచరిత, కన్నబాబు, కొడాలి నాని, పేర్నినాని, బొత్స సత్యనారాయణ,లతో పాటు ఆయాశాఖలకు చెందిన ఐఎఎస్ అధికారులు కూడ ఉంటారు.వీరితో పాటు డీజీపీ కూడ సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది.

Also Read:పాపం పండే రోజు వస్తే దాక్కోలేరు: చంద్రబాబుపై నాని వ్యాఖ్యలు

ఈ కమిటీ మూడు వారాల్లోపుగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.  అయితే అమరావతి కాకుండా రాష్ట్రానికి మూడు రాజదానుల  విషయమై చర్చించేందుకు గాను న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ అడ్వకేట్ జనరల్‌తో ఈ కమిటీ చర్చింనుంది.

ఈ కమిటీ నివేదిక తర్వాత ఈ నెల 20 లేదా 21 తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల ఏర్పాటు విషయమై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని  సమాచారం. అయితే ఈ సమయంలో విపక్షం అభిప్రాయాన్ని కూడ ప్రభుత్వం తీసుకొనే అవకాశం ఉంది.

అయితే మూడు రాజధానుల ఏర్పాటు విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారనే ప్రచారం గతంలో సాగింది. కానీ, ప్రస్తుతం హైపవర్ కమిటీ నివేదిక తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే విషయమై ఇంకా ప్రభుత్వం నుండి స్పష్టత లేదనే  సమాచారం.

మరో వైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  అమరావతి రైతులు 12 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం కూడ అమరావతి ప్రాంతవాసులు  ఆందోళన చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు.

రాజధాని తరలింపు అనే అంశాన్ని ఈ జీవోలో ప్రస్తావించలేదు. అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగానే అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఈ జీవోలో ప్రస్తావించింది. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఈ జీవోలో పేర్కొన్నారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.