రైతు కంట కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేందని కూడా శాపనార్ధాలు పెట్టారు. చంద్రబాబువన్నీ దిక్కుమాలిన ఆలోచనలేనని మండిపడ్డారు.

చంద్రబాబునాయుడుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేసారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకోకపోతే అసెంబ్లీని జరగనివ్వమని హెచ్చరించారు. అప్పటికీ చంద్రబాబు మనస్సులో రైతులకు మంచి జరగాలని కలగకపోతే రైతుల తరపున పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తానని కూడా చెప్పారు.

అదే సమయంలో రైతు కంట కన్నీరు చూసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేందని కూడా శాపనార్ధాలు పెట్టారు. చంద్రబాబువన్నీ దిక్కుమాలిన ఆలోచనలేనని మండిపడ్డారు.

రైతులకు మద్దతు ధరలు, వ్యవసాయ రంగంలోని ఇబ్బందులు తదితర అంశాలపై జగన్ చేసిన రెండు రోజుల దీక్ష ముగిసింది. అనంతరం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబుపై నిప్పులుచెరిగారు. తన జేబులు నింపుకోవటానికి పోలవరం లాంటి ప్రాజెక్టుల అంచనాలను పెంచేస్తున్న చంద్రబాబుకు రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరలు పెంచాలని తెలీదా అంటూ నిలదీసారు.

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన కరువు కూడా వెంటనే వస్తుందని ఎద్దేవా చేసారు. పంటల విస్తీర్ణం తగ్గిపోవటంలో, రైతుల సమస్యలు పెరిగిపోవటంలో మాత్రం చంద్రబాబు తన రికార్డులను తానే బద్దలు కొడుతారన్నారు.

పంటలు నిల్వ చేసుకునేందుకు మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజిలు లేక, గిట్టుబాటు ధరలు రాక, తిరిగి తమ ఇళ్ళకు పంటలను తీసుకుపోలేక రైతులు తప్పని పరిస్ధితుల్లో తమ పంటలను రోడ్లపాలు చేస్తున్నట్లు వాపోయారు. ఎన్నికల సమయంలో రైతులకు స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని,

మద్దతు ధరలు కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిని మరచిపోయారంటూ ధ్వజమెత్తారు. మొత్తం మీద జగన్ దీక్షకు రైతులు, విద్యార్ధులు, స్ధానికుల నుండి విపరీతమైన స్పందన కనబడింది.