నంద్యాల ఉపఎన్నికలో నాలుగు రౌండ్లు అయ్యేటప్పటికి టిడిపి దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సుమారు 9450 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుండి టిడిపి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించటం గమనార్హం.

నంద్యాల ఉపఎన్నికలో నాలుగు రౌండ్లు అయ్యేటప్పటికి టిడిపి దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సుమారు 9450 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుండి టిడిపి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించటం గమనార్హం. కౌంటింగ్ సరళిని చూస్తే ముందు కూడా టిడిపి ఆధిక్యం కొనసాగుతుందా అన్న అనుమానాలే కలుగుతున్నాయి.

చంద్రబాబునాయుడు మూడు విడతలుగా 6 రోజుల పాటు నంద్యాలలోనే క్యాంపు వేయటం, 12 మంది మంత్రులు రెండు మాసాలుగా తిష్టవేయటం, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు నేతలను నంద్యాలలో చంద్రబాబు మోహరించిన ఫలితం కనబడతున్నట్లే ఉంది. వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి ప్రచారంతో పాటు శిల్పా వ్యక్తిగత ప్రాబల్యం తక్కవేమీ కాకపోయినా టిడిపి మంత్రాంగం ముందు నిలవలేకపోయిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో వైసీపీకి బాగా మెజారిటీ వస్తుందని, పట్టణంలో 50:50 ఓట్లు పడ్డాయన్న అంచనాలు తల్లక్రిందులవుతున్నట్లు సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి.